కరకగూడెం,సెప్టెంబర్30 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా చొప్పాల పంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామంలో బీటీ రోడ్డు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం. అనంతరం
తాటిగూడెం పంచాయతీ పరిధిలో,కరకగూడెం పంచాయతీ పరిధిలో,వట్టం వారి గుంపు పంచాయతీ పరిధిలో,చిరుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోపలు అభివృద్ధి పనులను 2 కోట్ల 50 లక్షల అంచనా తో పనులు ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 50