E-PAPER

చింతకుంట సొసైటీలో గ్రామసభ

మోస్రా సెప్టెంబర్ 28 వై సెవెన్ న్యూస్ తెలుగు

మోస్రా మండలం చింతకుంట సొసైటీ ఆవరణ లో సంఘ అధ్యక్షులు గుడిపల్లి గంగారెడ్డి అధ్యక్షతన సమావేశమే ఈ క్రింది అంశములను చర్చించి తీర్మానించడం జరిగింది. తేది: 01-04-2023 నుండి 31-03-2024 వరకు జరిగిన లావాదేవీల జమాఖర్చులు, వ్యాపార లాభ నష్టముల పట్టికల ఆమోదము.
2023-24 సంవత్సరం యొక్క ఆడిట్ రిపోర్ట్స్ ను ఆమోదించుట.సంఘం ద్వారా బంగారు ఆభరణములపై రుణాలు ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. రుణమాఫీ కానీ రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని తీర్మానించడం జరిగింది.
ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులను వెంటనే విడుదల చేయాలని సభ్యులందరూ తీర్మానించడం జరిగింది.సంఘం ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి , మద్దతు ధర మరియు ప్రతి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని తీర్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గుడిపల్లి గంగారెడ్డి సంఘ డైరెక్టర్లు మరియు సంఘ సిబ్బంది మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News