E-PAPER

సమస్యల వలయంలో అల్లినగరం గ్రామం

మధిర,సెప్టెంబర్28 వై 7న్యూస్;

మధిర మండలం అల్లినగరం గ్రామం సమస్యల వలయంలో చిక్కుకుందని వాటిని పరిష్కరించే నాధుడు కరువయ్యారని సిపిఎం శాఖ కార్యదర్శి శాఖమూరి కోటేశ్వరరావు అన్నారు.గ్రామంలో త్రాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ బురదమయం అయ్యాయని పేదల ఇల్లు మునిగాయని వస్తువులు పంటచేలు ఆగమయ్యాయని గ్రామంలో కోతుల బెడదతో పంట చేలు ఆగమవుతున్నాయని అన్నారు.
సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు తెలియజేశారు.ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సూర్యదేవర సాంబశివరావు శ్రీనివాసరావు మరియు ఇతర గ్రామ నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News