E-PAPER

కుట్రపూరిత రాజకీయాలు చేయటమే బీజేపీ ప్రభుత్వం నైజం;ఓరుగంటి రమేష్ బాబు

. ఎదిరించిన నేతలపై సీబీఐ, ఈడి లను ఉసిగొల్పి దారికి తెచ్చుకోవాలనుకోవటం అవివేకం

. రాజకీయ కుట్రలో భాగమే పొంగులేటి శ్రీనన్న ఇండ్ల పై సోదాలు.

. అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఓరుగంటి రమేష్ బాబు

అశ్వాపురం,సెప్టెంబర్28 వై 7న్యూస్;

ప్రజానాయకుడు,మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ళు , కారాలయములపై 16 చోట్ల ఈడీ దాడులు చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడటం బీజేపీ కి కొత్తేమీ కాదు. మాట వినని నాయకులపై అస్త్రాలు ప్రయోగిస్తూ దారికి తెచ్చుకోవడం కోసం సీబీఐ, ఈ డి వ్యవస్థలను వాడుకోవటం సిగ్గుచేటని,పొంగులేటి శీనన్నను టార్గెట్ చేసి సాధించేదేమిఉండదని, ఇదంతా బిజెపి పార్టీ కుట్రలో భాగమేనని ఇటువంటి దుశ్చర్యలను సహించబోమని, ఇటువంటి కుట్రపూరిత పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి రమేష్ బాబు అన్నారు.
_______________________

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News