మణుగూరు,సెప్టెంబర్28 వై 7న్యూస్;
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ళు , కార్యాలయాలపై 16 చోట్ల ఈడీ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది ప్రతిపక్షాల రాజకీయ కుట్రలో భాగమేనని, ప్రజా అభిమానం గల నేతను డైరెక్ట్ గా ఎదుర్కొనలేక ఇలా దుశ్చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని, ఇటువంటి హేయమైన రాజకీయాలకు ప్రజలు రాబోవు రోజుల్లో తగిన బుద్ధి చెప్పుతారని,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సురేష్ తీవ్రంగా ఖండించారు.ప్రజా అభిమానం కల పొంగులేటి శీనన్న నేటి రాజకీయాల్లో కడిగిన ముత్యం లాంటివాడని, అలాంటి గొప్ప వ్యక్తిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వల్ల సాధించేదేమి ఉండదని అన్నారు.
ఇదంతా ప్రతిపక్షాల కుట్రలో భాగమేనని ఇటువంటి అప్రజాస్వామిక రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
Post Views: 157









