. రజక లాండ్రీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఇందిరాల నర్సయ్య
హుజూర్ నగర్, సెప్టెంబర్ 26 వై 7 న్యూస్
ప్రశ్నిస్తే ప్రాణాలు పోతాయన్నంత భయంతో బతుకుతున్న నేటితరానికి చాకలి ఐలమ్మ ఒక మార్గదర్శి అని రజక లాండ్రీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఇందిరాల నర్సయ్య అన్నారు. గురువారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పట్టణంలోని అమరవీరుల స్థూపం నందు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ,
ఈ భూమి నాది, పండిన పంట నాది, తీసుకెళ్లడానికి ఆ దొర ఎవడు అంటూ బడుగు జీవుల రక్తాన్ని పీల్చే దొరలకు ఎదురొడ్డి నిలబడిన ధీశాలి చాకలి ఐలమ్మ,అని ఆమె మహిళా లోకానికి, యువతరానికి ఆదర్శం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. ఆమె పేరులేనిదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేదంటే అతిశయోక్తి కాదనీ అన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అలవాల ఉపేందర్, ఇందిరాల రాంబాబు, వడ్లానపుశ్రీను,అంజి,నరసింహారావు,
పిచ్చయ్య,దుగ్గి నరసింహారావు,సాయిబాబా, దుగ్గి బ్రహ్మం,తిరపయ్య, ఐ.నరేష్,దీప, సైదులు తదితరులు పాల్గొన్నారు.