బిచ్కుంద సెప్టెంబర్ 26 వై 7 న్యూస్ తెలుగు
బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో
భారత రాష్ట్ర సమితి పార్టీ తాజా మాజీ ఎంపీపీ బిచ్కుంద మండలం రాజోల్ల గ్రామానికి చెందిన అశోక్ పటేల్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో తన ఇంట్లో కన్నుమూశారు. జూకల్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. అశోక్ పటేల్ సతీమణి కూడా ఎంపీపీగా బిచ్కుందకు పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తాజా మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల భారత సమితి పార్టీ కార్య నిర్వాహ అధ్యక్షులు కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, స్థానిక మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేశారు. ఎంపీపీగా విధులు నిర్వహిస్తున్న అశోక్ పటేల్ పార్టీలకు అతీతంగా సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారు. ఓ మంచి నాయకుడిగా జూకల్ నియోజకవర్గం లోని ఎదిగారు. ముఖ్యంగా అశోక్ పటేల్ మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి తీరని లోటని చెప్పొచ్చు.ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ సంతాపం వ్యక్తం చేశారు.