మిర్యాలగూడ,సెప్టెంబర్23 వై7 న్యూస్ ప్రతినిధి;
పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో కలియతిరిగి రోగులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందిని కలిసి ఉదయాన్నే ఓపి ఉండటం వలన రోగులు దూరప్రాంతాల నుంచి వచ్చి వెయిట్ చేస్తుంటారు.కావున సిబ్బంది సమయ పాలన పాటించాలి 10 గంటల వరకు ప్రతిఒక్కరూ అందుబాటులో ఉంటూ వారికి త్వరగా వైద్యం అందేలా చూడాలి అని అన్నారు.ముఖ్యంగా హాస్పిటల్స్ కి వచ్చిన గర్భిణీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ,వారికి ఎక్కువ సమయం కేటాయించి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.
Post Views: 37