E-PAPER

ఆర్యజనని,ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శిక్షణ శిబిరం

భైంసా,సెప్టెంబర్ 17 వై సెవెన్ న్యూస్

భైంసా పట్టణంలోని నర్సింహ కళ్యాణ మండపంలో ఆర్య జనని మరియు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు ఆధ్యాత్మిక సంస్కారంతో మంచి ఆలోచనలతో భావోద్వేగాలను అదుపు చేసుకొన్నపుడే మంచి లక్షణాలు,తేజోవంతులైన,గుణవంతులైన పిల్లలు జన్మిస్తారని తెలిపారు. పౌష్టికాహార మాసంలో భాగంగా పోషకాహారంతో పాటుగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కొరకు అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. పెరేంటింగ్ అంటే చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత ప్రారంభమైన ప్రక్రియ అని అనుకుంటారని,కానీ పిల్లల పెంపకం బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే ప్రారంభమవుతుందని, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అనర్ధాలను దృష్టిలో ఉంచుకొని గర్భస్థ దశ నుండే తల్లి నుండి బిడ్డకు సంస్కారాలు అందాలని,గొప్ప మాతృమూర్తులే గొప్ప వ్యక్తులను తయారు చేస్తారు అన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.గురుకృపా సంస్థల డైరెక్టర్ ముష్కం ప్రసన్న రాణి మాట్లాడుతూ సాధారణ కాన్పు కొరకు మహిళలు ముందస్తు వ్యాయమాలు చేయాలని తెలిపారు.ఆరోగ్యభారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆర్యజనని కార్యక్రమాలు భైంసా వంటి సుదూర ప్రాంతాలలో ఏర్పాటు చేసి సమాజంలో శాంతిని,ఆనందాన్ని పంచి ఇచ్చే తరాన్ని తయారు చేయడం చాలా అవసరమని అన్నారు. వచ్చిన ప్రతి మహిళకు ఆర్య జనని తరఫున అత్యధిక పోషక విలువలు కలిగిన లడ్డూల ప్యాకెట్ను పంపిణీ చేశారు . ఐ సి డి ఎస్ తరఫున పోషక విలువలు గల పదార్థాలను ప్రదర్శనలు ఉంచారు. ఈ కార్యక్రమంలో పతాంజలి మహిళా సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు శోభ మాందాని,భైంసా మునిసిపాలిటీ కౌన్సిలర్ తోట విజయ్,బాసర జడ్పిటిసి రమేష్, సీనియర్ నాయకులు వెంగల్ రావు ,అంగన్వాడీ సిబ్బంది,గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News