బీర్కూరు సెప్టెంబర్ 17వై 7 న్యూస్ తెలుగు
బాన్సువాడ వ్యవసాయ సహాయ సంచాలకులు అనిల్ కుమార్ బీర్కూర్ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బాన్సువాడ వ్యవసాయ శాఖకు ఏడిగా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్, బీర్కూర్ కు ప్రత్యేక అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, సమన్వయంతో పనిచేస్తూ మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కార మార్గం చూస్తామని ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ తెలిపారు. మండల అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అనిల్ కుమార్ వెల్లడించారు.
Post Views: 83









