E-PAPER

తెలంగాణ రైతాంగ సాయుదపోరాటయోధులకు అమరవీరులకు విప్లవ జోహార్లు

మంచిర్యాల ,సెప్టెంబర్17 వై 7 న్యూస్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మహమ్మద్ ఖాసిం బస్తీలో ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ అధ్యక్షతన 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ సీనియర్ నాయకురాలు గుండా సరోజ, అరుణ పతాకాపవిష్కరణ గావించారు.శాంతిగని బస్తి జెండాను రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ ఎగురవేసినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట్ స్వామి మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులైనటువంటి దాజీ శంకర్ రావు, కస్తాల రామకృష్ణ, బాసెట్టి గంగారాం, పోతుగంటి పోశెట్టి, రంగనాథరావు, బొలం వార్ లాంటి ఉద్దండ నాయకులు నైజాం నవాబు నుండి తెలంగాణ విమోచనకై, శక్తి వంచన లేకుండా పోరాటం చేసారని గుర్తు చేశారు. అలాంటి మరెందరో సిపిఐ నాయకులు ప్రాణ త్యాగం చేయడం జరిగిందన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి లంబాడి తండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించింది అని వారు తెలియజేసారు. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివిధ బస్తీలలో అరుణ పథకాన్ని ఎగరవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలియజేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి హిందూ ముస్లిం మధ్య గొడవగా చిత్రీకరించడాని బిజెపి మానుకోవాలని వారు హితవు పలికారు, ఈ కార్యక్రమంలో సీనియర్ కామ్రేడ్ చిప్ప నర్సయ్య గారు, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ గారు, పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు అధ్యక్షురాలు బొల్లం సోనీ, సీనియర్ నాయకులు రత్నం రాజం తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్