. బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీని బ్రస్టు పట్టిస్తున్న అధ్యక్షుడు దుగ్గెంపూడి.
. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆరోపణలు.
బూర్గంపాడు, సెప్టెంబర్ 17 వై సెవెన్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా కొనసాగుతూ ప్రజల నుండి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీని అబాషుపాలు చేస్తూ అనేక విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూగ్గంపూడి కృష్ణారెడ్డి అని ఆరోపించారు.ఇటీవల కాలంలో ఆయన చేసే కార్యక్రమాలు ఒంటెద్దు పోకడను తలపిస్తున్నాయని, అనేకమంది అమాయకులను మోసం చేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని విమర్శలువ్యక్తమవుతున్నాయి అని అన్నారు. ఇటీవల కాలంలో ఓ మహిళ నాయకురాలు పబ్లిక్ గా అతని చేసే పనులపై బహిరంగ విమర్శలు చేసింది, అయినప్పటికీ మండల అధ్యక్షుడు పలువురు నాయకులు కూడా ఆమె చేసిన ఆరోపణలు తిప్పికొట్టలేకపోయారు. దాంతోపాటు సారపాక పలుచోట్ల ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడని అమాయకులను మోసం చేస్తూ ఇంటి స్థలాలు, ఇండ్లు కబ్జా చేస్తున్నాడని తన సొంత తమ్ముడిని మోసం చేసి స్థలాన్ని ఆక్రమించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.అర్ధ రాత్రిలు ఇసుక ట్రాక్టర్లు ఆపు చేస్తూ ఒక మండల స్థాయి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నాడని వాపోయారు.రాబోయే రోజుల్లో దుర్గంపూడి కృష్ణారెడ్డి మండల అధ్యక్షులుగా కొనసాగితే స్థానిక ఎన్నికల్లో గాని, ప్రజల్లో గాని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చర్యలు తీసుకోవాలని, అతని స్థానంలో మరొకరిని అర్హులైన వారిని బూర్గంపాడు మండల అధ్యక్షుడిగా నియమించాలని కోరారు.ఇతనిపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు విచారణ చేపడితే అన్ని బాగోతాలు బయటపడతాయని బహిరంగంగానే విమర్శించారు. ఆరోపణలను రుజువు చేయడానికి ఎప్పుడైనా, ఎక్కడైనా సరే సిద్ధమని
మోహన్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.
రాబోయే కాలంలో అతని అరాచకాలకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు