తూప్రాన్ సెప్టెంబర్ 15 వై సెవెన్ న్యూస్
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బుడ్డ భాగ్యరాజ్ గ ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన బోధనలను సార్థకం చేయాలని సూచించారు.
Post Views: 170