. ప్రజా సమస్యలపైనే కమ్యూనిస్టుల పోరాటం
. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్
హుజూర్నగర్, సెప్టెంబర్ 11 వై 7న్యూస్;
తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి నేటి వరకు దేశంలోని పేద ప్రజలందరికీ అండగా నిలిచింది కమ్యూనిస్టు జెండా నేనని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. బుధవారం 76వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లోని చింతలపాలెం అమరవీరుల స్తూపం నుండి సిపిఐ జాతా ప్రారంభమై మఠంపల్లి,గరిడేపల్లి, నేరేడుచర్ల లలో సాయుధ పోరాట అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సిపిఐ జాత హుజూర్నగర్ చేరుకొని సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన అమరవీరుల స్తూపం వద్ద సాయుధ పోరాట వీరులు దొంతి రెడ్డి శెంబిరెడ్డి, దాసరి లింగన్న, మిలటరీ గోపయ్య, చింతలపూడి రాములు లకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభలో గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపైనే కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తారన్నారు. స్వేచ్ఛాయుత సమాజం కోసం కమ్యూనిస్టులు సాయుధ పోరాటంలో ప్రాణాలర్పించారు అన్నారు. దేశ చరిత్రలో నిరంకుశ అధికారానికి వ్యతిరేకంగా జరిగిన మహా పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నారు.తెలంగాణ ప్రజల జీవితాలలో ఉద్యమం,పోరాటం భాగమని వారికి కమ్యూనిజం వారసత్వం సంపద లాంటిది అన్నారు.ఈనాడు హంగులు ఆర్భాటం తప్ప పేద ప్రజలకు దేశంలో ప్రత్యేకమైన అభివృద్ధి అంటూ ఏమి జరగలేదని విమర్శించారు. ఆనాటి సాయుధ పోరాట అమరుల ఆశయాలను, లక్ష్యాలను స్ఫూర్తిగా తీసుకొని కమ్యూనిస్టులు ఉద్యమిస్తున్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రజలను ఉద్యమించకుండా ఎంతోకాలం అణిచివేయలేరన్నారు. బూర్జువా అభివృద్ధి, మతతత్వ భావనలతో ప్రజలను మభ్య పెట్టాలని చూసే ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. కష్టాలు సమస్యలు ఎక్కడుంటే కమ్యూనిస్టులు అక్కడే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, పుస్తెల నారాయణరెడ్డి, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, ధూళిపాల ధనుంజయ నాయుడు, దొంత గాని సత్యనారాయణ, జడ శ్రీనివాస్, యల్లావుల రమేష్, అమరవరం పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.