కామేపల్లి,సెప్టెంబర్11 వై 7 న్యూస్;
తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, కామేపల్లి మండల నాయకులతో కలిసి మండలంలో విశృత పర్యటన చేశారు.
ఓడ్డుగూడెం కి చెందిన బరిగొర్ల సురేష్ అనే వ్యక్తి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి, వారు హాస్పటల్లో కట్టిన డబ్బులు, హాస్పిటల్ నుంచి ఆ కుటుంబానికి చెక్కు ద్వారా ఇప్పించి సురేష్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడనుండి మున్సిబ్ బంజర లో ఒక వ్యక్తి మరణించారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కామేపల్లి లో దశ దిన కార్యక్రమంలో పాల్గొని, ముచ్చర్ల గ్రామంలో దశ దిన కార్యక్రమంలో పాల్గొని, వరికొల్లు సైదులు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అక్కడనుండి పండితాపురం వెళ్లి దశ దిన కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగినది. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని చనిపోయిన వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.