E-PAPER

చాకలి ఐలమ్మ కి ఘన నివాళి

హుజూర్నగర్ ,సెప్టెంబర్10 వై 7న్యూస్;

తెలంగాణ ప్రజల తెగువను పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలోని బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బొడ్డు గోవిందరావు, గూడెపు దీప మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో గణనీయమైన పాత్రను పోషించి రజాకారులను తరిమికొట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జెనిగల శ్రీనివాస్ గౌడ్, వార్డ్ కౌన్సిలర్ త్రివేణి వార్డ్ ఇంచార్జ్ మేకల వెంకటేశ్వర్లు, కొట్టు శేఖర్, కర్నే కృష్ణ, కర్నే వెంకటేశ్వర్లు, శెట్టి శ్రీనివాస్, కొండ లింగారావు భీమిశెట్టి రవి బ్రహ్మం, తండు శ్రీనివాస్, కర్నే నాగయ్య, బత్తిని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :