E-PAPER

జెడ్ పి హెచ్ ఎస్ కమలాపురం లో ఘనంగా తెలంగాణ బాషా మాండలిక దినోత్సవం

మంగపేట, సెప్టెంబర్ 10వై 7న్యూస్;
ములుగు జిల్లా కమలాపురం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కాళోజి జన్మదిన సందర్బంగా తెలంగాణ మాండలిక బాషా దినోత్సవం ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమం లో విద్యార్థులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించే విదంగా బతుకమ్మ లు, బోనాలు, పీరీలు, తీజ్ బుట్టలు ఆదివాసీ వేశాధారణ క్రైస్తవ మేరీ మాత వంటి వేషాలతో సంస్కృతి క కార్యక్రమాలతో అలరించారు..ఇందులో పీరీలు మరియు తీజ్ బుట్టలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ లోని ప్రతి సంస్కృతి గొప్ప తనాన్ని విద్యార్థులు తెలుసుకోవాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.. ప్రతి ఒక్కరూ ఇతర మతాలు సంస్కృతి ని గౌరవించడం నేర్చుకో వాలి అని పిలుపు నిచ్చారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు మెమంటో లు సాంస్కృతిక విభాగం ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి గారికి సన్మానం చేసారు.ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఊరు అనిత జ్వాలా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మునిగాలా రాకేష్ సి ఐ టి యు వెంకట్ రెడ్డి ఉపాధ్యాయులు ప్రసాద్ సునీత లావణ్య నర్సింహారరావు నాగమ్మ మౌలాలి వేణుమాధవ్ రెడ్డి నాగలక్ష్మి రమేష్ రాజు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :