పినపాక, సెప్టెంబర్ 10;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం
వరద ప్రభావిత ప్రాంతాల్లో దానధర్మ ట్రస్ట్ నిర్వాహకురాలు గంటా రాధా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని మణుగూరు మండలంలోని మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని బుడగజంగాల గుంపు, అశోక్ నగర్ వాగోడ్డు , అశ్వాపురం మండలంలోని మల్లెల మడుగు ప్రాంతాల్లో పర్యటించి, దానధర్మ ట్రస్టు ద్వారా వరదల వల్ల సర్వం కోల్పోయిన 120 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్ ను అందజేశారు. ఆమె మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, ఇతర సరుకులను పంచినట్టు తెలిపారు. వరదలతో అతలాకుతలమైన నియోజకవర్గ ప్రజలకు తన వంతుగా దానధర్మ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నానని , మా ట్రస్టు కు సహకరిస్తున్నసహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.