E-PAPER

సేవాలాల్ సేన సింహగర్జన వాయిదా..

కామేపల్లి,అక్టోబర్ 04 వై 7 న్యూస్;

తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా మరియు ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం ఉందని దాని మూలంగా మరికొన్ని రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన వివరాలను పరిగణనలోకి తీసుకొని అదేవిధంగా ఇప్పటికే రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాల, వరదల వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరిగి ప్రజలు సతమతం అవుతున్నారు. రోడ్లు తెగిపోయి, రవాణా వ్యవస్థ దెబ్బతిని అస్తవ్యస్తమైన పరిస్థితులను గమనించి, సేవాలాల్ సేన జిల్లా కమిటీ, రాష్ర్టకమిటీల అభిప్రాయం మేరకు సెప్టెంబర్ 9 న చలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సేవాలాల్ సేన 10 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలపెట్టిన గిరిజన సింహగర్జన సభను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. మరల సింహగర్జన సభా తేదీని త్వరలో రాష్ర్టకమిటీ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని అన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :