అశ్వారావుపేట ,అక్టోబర్02 వై 7న్యూస్;
ఇటీవలే భారీ వర్షాలకు నారాయణపురం గ్రామానికి చెందిన కాటం చిట్టియ్య పూరి గుడిసె(నివాసం ) లోకి వరద నీరు వచ్చి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం పనికి రాకుండా పోయాయి ఇల్లు కూడా కూలిపోయింది. అతని కుటుంబం కూలి కెళ్ళి జీవనం సాగించే కుటుంబం. అట్టి కుటుంబానికి నేను వున్నా అంటూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చిన కొంత ఆర్థిక సహాయం చేయడం ఆయన నైజం.ఇదే క్రమంలో కాటం చిట్టియ్య కుటుంబానికి ఈ రోజు ఒక రైస్ బ్యాగ్, పలు రకాల కూరగాయలు, నిత్యవసర సరుకులు అందజేసిన నారాయణపురం కాంగ్రెస్ నాయుకులు అందరూ వాడు ఆంధ్రయ్య. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మహిళా నాయుకురాలు పెద్దపూడి సత్యవతి, యువ కాంగ్రెస్ నాయకుడు పరిటాల సందీప్ కుమార్, కూకటి రాము తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు
Post Views: 49