E-PAPER

72 గంటలు అప్రమత్తంగా ఉండాలి;ఎమ్మెల్యే బిఎల్ఆర్.

మిర్యాలగూడ,సెప్టెంబర్01 వై 7 న్యూస్

నల్లగొండ జిల్లా,మిర్యాలగూడ పట్టణం లో లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్.మిర్యాలగూడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, 72 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆదేశించారు.ఆదివారం ఆర్డిఓ కార్యాలయంలో మున్సిపల్, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, ఎంపీడీవో, తదితర శాఖల అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఎమ్మెల్యే బిఎల్ఆర్ నిర్వహించారు.ఏ ఒక్కరు కూడా అనుమతి లేకుండా సెలవులు పెట్టరాదు అన్నారు.ఏ సమాచారం అయినా కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. విద్యుత్ కోత విధించరాదన్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలపై అధికారులతో సమీక్షా సమావేశం రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామన్నారు.అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని షాబునగర్, తాళ్లగడ్డ, బంగారుగడ్డ తదితర లోతట్టు ప్రాంతాలను సందర్శించి ఆయా కాలనీవాసుల తో మాట్లాడారు.ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఎండి.యూసుఫ్ తహసిల్దార్ హరిబాబు, ఎంపీడీవో శేషగిరిశర్మ, వన్టౌన్ సీఐ కోట కరుణాకర్, టూ టౌన్ సీఐ నాగార్జున, ఎస్ఐలు, రెవెన్యూ ఆర్ఐలు రామకృష్ణ , సత్యనారాయణ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News