. ఏ ఐ ఎస్ బి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్
మెదక్, సెప్టెంబర్ 1 వై సెవెన్ న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు భారీ వర్షాలు పడటం వల్ల పలు ప్రభుత్వ మరియు ప్రయివేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఎలాంటి హాని జరగ కూడదని మెదక్ జిల్లా కేంద్రం లొ ఆయన ఒక ప్రకటనలొ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు విద్యా సంస్థలకు తప్పకుండ సెలవులు ప్రకటించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షం లొ ఈ రెండు రోజులలో విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వర్షాల కారణంగా ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రిదే అని అయన అన్నారు. తక్షణమే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఏ ఐ ఎస్ బి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ రాష్ట్ర ప్రభుత్వం పై సవాల్ విసిరాడు.