. తుపాకులగూడెం బ్యారేజ్ నీళ్లు తరలించే ప్రయత్నం
. మైదాన ప్రాంతాలకు నీరు అందించేందుకే మంత్రి పర్యటన
. బిజెపి నేత జాడి రామరాజు
కన్నాయిగూడెం,ఆగస్టు30 వై సెవెన్ న్యూస్
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో శుక్రవారం రోజున గోదావరి నదివారిక ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతం కన్నాయిగూడెం మండలంలో చుక్క నీరు అందకుండా ఇక్కడి వనరులు మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అభివృద్ధికి నోచుకోని ఏజెన్సీ ప్రాంతాలపైనే నేటి కాంగ్రెస్ నాయకుల కన్ను పడింది. తుపాకుల గూడెం సమ్మక్క సారలమ్మ బ్యారేజీలో ఉన్న నీళ్ల పైన వారి దృష్టి పడింది. ఈ మండల పరిధిలో ఉన్న రైతన్నలకు చుక్క నీరు దక్కకుండా బ్యారేజీ నీళ్లు మైదాన ప్రాంతాలకు తరలించడం కోసమే తుపాకులగూడెంలో సమ్మక్క సారక్క పర్యటన చేశారని బిజెపి నేత కిసాన్ మేర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిలాబాద్ ఇంచార్జ్ జాడి రామరాజు అన్నారు. నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలనలో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడ నుండి నాటి కాంగ్రెస్ నేతలు దేవాదుల ఎత్తిపోతల పథకం పేరుతో ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చిన నాయకులు ఈ ప్రాంత వనరులు తరలించాలనే చూస్తున్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల పర్యటనలు చూస్తుంటే ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కన్నా ఈ ప్రాంత వనరులపైనే ఎక్కువ మక్కువ ఉన్నట్లు ఉన్నది అంటూ ఆయన మండిపడ్డారు.అదే విధంగా ఏటూర్ నాగారం లో నిర్మించిన బస్ డిపోను తొర్రూరుకు తరలించిన ఘనత వారిదే అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు తీరని అన్యాయం చేసిన కడియం శ్రీహరి ఏ ముఖం పెట్టుకొని మళ్లీ తుపాకులగూడెం వచ్చారో స్థానిక మంత్రి తెలపాలి అన్నారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన కడియం శ్రీహరి తుపాకులగూడెం పర్యటన చేయడానికి కారణం ఏమిటో స్థానిక మంత్రి ప్రజలకు తెలపాలి అన్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత ఆదివాసి దళిత బహుజన వర్గాల ప్రజలు ఒకసారి ఆలోచించండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు తుపాకులగూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్ మంత్రుల పర్యటనలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసి దళిత బహుజనల వర్గాల ప్రజలకు రైతులకు కలిగే లాభం ఏమిటో ఒకసారి ఆలోచించి మంత్రి సమాధానం చెప్పాలి అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పిన మంత్రి నేడు ఏజెన్సీ ప్రాంతాల వనరులు తరలించే ప్రయత్నాలు చేస్తుంది అంటూ మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల నేటి వనరులు స్థానిక గ్రామాలకు అందించకుండా మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తే సహించేది లేదు అంటూ జాడి రామరాజు మండిపడుతున్నారు..