E-PAPER

సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా మూడు రత్నం నాయక్ నియామకం

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27 వై 7న్యూస్;

జనగామ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ , జిల్లా కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం ఉత్సాహంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులుగా మూడు రత్నం నాయక్ ఎన్నికైనందున సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ వారిని శాలువాతో సత్కరించి నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మూడు రత్న నాయక్ మాట్లాడుతూ యావత్ బంజారా ఒక తాటి పైకి వచ్చి మేం ఎంతో మా వాటా అంత అనే నినాదంతో మన హక్కులను సాధించుకోవాలని సూచించారు. అలాగే పెండింగ్ లో ఉన్న గిరిజనులకు రావలసిన ట్రై కార్ లోన్ లబ్ధిదారులుకు వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ , ప్రేమ్చంద్ నాయక్ , శ్రీను నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు🚩✊✊

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News