మణుగూరు, ఆగస్టు 27, వై 7న్యూస్;
మణుగూరు పట్టణంలో పశువులు ప్రధాన రహదారులపైనే సంచరిస్తూ ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొంత మంది పశువులను ఇలా రోడ్డుపై వదిలేయడంతో రోడ్లపైనే సేద తీరుతున్నాయి. టెలిఫోన్ ఎక్స్చేంజ్ సెంటర్ నుంచి సురక్ష బస్టాండ్ వరకు రోడ్డులో పదుల సంఖ్యలో పశువులు కూర్చుంటున్నాయి.పశువులు రోడ్డుపైనే ఉండడంతో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.నిత్యం రోడ్లపైన పశువుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాత్రి పగులు తేడా లేకుండా రోడ్లపైనే తిరుగుతున్నాయి.వాటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి కింద పడిపోతున్నాయి. తగిన చర్యలు తీసుకోవాలి.
రాత్రి వేళ ఈ పశువులు ఇక్కడే దుకాణాల ముందు పడుకుంటున్నాయి.ఎంత తోలినా మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తూ మా వ్యాపారాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.వాటి కోసం ఏర్పాటు చేసిన బందెల దొడ్డిలో ఉంచితే బావుంటుంది.
అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు.









