E-PAPER

విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి;ప్రజావాణిలో వినతి పత్రం

వై సెవెన్ న్యూస్ భద్రాచలం

భద్రాచలం పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సబ్ విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ రాజారావుకి మాజీ వార్డ్ మెంబర్ బండారు శరత్ బాబు నేతృత్వంలో స్థానిక ప్రజలు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బండారు శరత్ బాబు మాట్లాడుతూ, నాలుగవ వార్డు పరిధిలో కాలేజీ గ్రౌండ్ వెనుక రామచంద్ర కాలనీలో ఉన్న స్తంభాలకు స్ట్రీట్ లైట్ వైరు వేయాలని, అదేవిధంగా ఆర్ రాముడు ఇంటిముందు రెండు కొత్త స్తంభాలు, గొల్ల బజార్ నుండి ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్లే సందులో రెండు కరెంటు స్తంభాలు వేయాలని కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇటీవల వర్షాలు వరదల సమయంలో విద్యుత్ అధికారులు ఎంతో సమర్థవంతంగా పనిచేసే పట్టణంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కృషి చేశారని ఈ సందర్భంగా బండారు శరత్ బాబు విద్యుత్ అధికారులను అభినందించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల అందరికీ అందటం లేదని విద్యుత్ అధికారులు దృష్టి పెట్టి అర్హులందరికీ ఉచిత విద్యుత్ అందేలాగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కే సమ్మయ్య, కె ఎస్ ఎల్ వి ప్రసాద్, వై శ్రీనివాసరావు, రామకృష్ణ, కే శ్రీనివాసరావు, డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్