ఆగస్టు23(వై7న్యూస్);
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన మంద కృష్ణ మాదిగ , దామోదర రాజనర్సింహ, మాదిగ ప్రజాప్రతినిధుల బృందం
ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని కోరుతూ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మంద కృష్ణ మాదిగ గారి నేతృత్వంలో బృందం విజ్ఞప్తి చేసింది.ఈ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని త్వరలోనే అమలులోకి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మోత్కుపల్లి ఎమ్మెల్యేలు వేముల వీరేశం , కాలే యాదయ్య , తోట లక్ష్మీ కాంతారావు , డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ గారు మాజీ ఎంపీ పసునూరి దయాకర్,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ పాల్గోన్నారు..