నసుల్లాబాద్,ఆగస్టు: 20( వై 7 న్యూస్);
బాన్సువాడ నియోజవర్గంలోని
నసుల్లాబాద్ మండలంలోని దుర్కీ గ్రామంలో
22 లక్షల రూపాయల తో నిర్మించిన దుర్కి సొసైటీ అదనపు భవనం ను సొసైటీ చైర్మన్ డివిటీ శ్రీనివాస్ యాదవ్ పాలక వర్గంతో కలసి ప్రాంభించారు. అనంతరం వ్యవసాయ ఏఇఓ జ్ఞానేశ్వర్, ఎన్ డిసిసి బ్యాంక్ మేనేజర్ సందీప్ ను సన్మానించారు.దుర్కి సొసైటీ లో 77 మంది రైతులకు 37 లక్షల రూపాయల కొత్త రుణాలు ఇచ్చారు.అలాగే దుర్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి లో అధిక మార్కులు వచ్చిన నీలం లావణ్య, గొడుగు వర్షిణి , చిలివేరి వెన్నెల లకు విద్యార్ధులకు దుర్కి సొసైటీ తరపున సొసైటీ ఛైర్మన్ డివిడి శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, వైస్ ఛైర్మన్ మెగావత్ అరుణ్, కార్యదర్శి గంగారాం, బ్యాంక్ మేనేజర్ ఎం సందీప్, డైరెక్టర్లు సరిచంద్, గంగారాం, మొగులవ్వ, జాహిర, పురం శ్రీనివాస్, సిబ్బంది సుధాకర్, కిషన్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.









