మాల జన సమితి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు చెట్టి సురేష్.
అశ్వాపురం,ఆగస్టు 20 (వై7న్యూస్);
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా ఈనెల 21వ తారీకు భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి జయప్రదం చేయాలని మాల జన సమితి పినపాక నియోజకవర్గం అధ్యక్షులు చెట్టి సురేష్ కోరారు. ఈ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గం లో ఉన్న అన్ని మండలాల రవాణా, వ్యాపారస్తులు, విద్యాసంస్థలవారు స్వచ్ఛందంగా సహకరించి బందును జయప్రదం చేయాలని కోరారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మాల మేధావులు ఉద్యోగస్తులు మాల విద్యార్థులు, కవులు, కళాకారులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు..
Post Views: 101









