E-PAPER

ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు

భైంసా, ఆగస్టు: 20(వై 7 న్యూస్)

భైంసా మండలంలోని భోస్లేనారాయణ పటేల్ ముధోల్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నారాయణరావు పటేల్ మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భారతదేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. గాంధీ కుటుంబం భారతదేశానికి చేసినటువంటి సేవలను మనం ఎప్పటికీ మర్చిపోలేము అని వారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేశారు. భోస్లే నారాయణరావు పటేల్ గుర్తు చేశారు వీరితో పాటు ఓం ప్రకాష్ లడ్డా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్ర, భైంసా టౌన్ అధ్యక్షులు షాహిద్ భాయ్ ,మాజీ ఎంపీపీ చంద్రకాంత్ నిగ్వ శ్రీనివాస్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కుబిర్.చంద్రకాంత్ బిద్రెల్లి,దేవరావు పటేల్, కదం ఆత్మ రామ్,లక్ష్మణ్,విజయ్, టి.లక్ష్మణ్.తొండల హన్మంతు రావు,ముధోల్ తాలూకా
మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కంబ్లే సాహెబ్ రావు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News