. నిందితుల్ని ఉరి తీయాలి.
. మహిళా చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి.
. సిట్టింగ్ జడ్జి తో విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయాలి
. పి డి ఎస్ యు భద్రాచలం డివిజన కార్యదర్శి
మునిగేలా శివ ప్రశాంత్
భద్రాచలం, ఆగస్టు 17 (వై 7 న్యూస్)
కలకత్తాలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆధ్వర్యంలో ఆర్ ఆర్ వాహిని కాలేజీలో నిరసన కార్యక్రమం ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.పి డి ఎస్ యు డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ పాల్గొని మాట్లాడుతూ, మహిళా చట్టాలని ప్రతిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం,వైఫల్యాల మూలంగానే అత్యాచార సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. మహిళలు విద్యార్థినీలు బస్సులో ప్రయాణ సందర్భంలో కూలీ అడ్డాలలో, నిర్మానుష ప్రాంతాలలో, విద్యాసంస్థలలో మార్కెట్, ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడ చూసినా మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారని ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించలేని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారని, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చినా. అత్యాచార నిరోధక చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ఇలాంటి దుర్మార్గపు సంఘటన నిలుపుదల చేయడం సాధ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు యువకులు మత్తు మందు పదార్థాలకు లోనై విచక్షణారహితంగా వ్యవహరిస్తూ అత్యాచార సంఘటనలకు పాల్పడుతున్న వైనం అనేక సందర్భాలలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు గంజాయి,డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తుపదార్థాలను నిలుపుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన అనేక నష్టాలను మహిళలు చవిచూడాల్సి వస్తుందని తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కలకత్తాలో సామ యొక్క అత్యాచారం జరిగిన వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని,అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సెంట్రల్ ప్రొటెక్ట్ యాక్ట్ లాంటి చట్టాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల అంతా ఐక్యం చేసి ఉద్యమాల్ని చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.