E-PAPER

జూనియర్ డాక్టర్ పీజీ విద్యార్థి అత్యాచారాన్ని ఖండించండి

. ప్రగతిశీల మహిళా సంఘం ప్రగతిశీల విద్యార్థి సంఘం డిమాండ్.

భద్రాచలం,ఆగస్టు17 (వై7న్యూస్)

కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భద్రాచలం పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్నం చేశారు. అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం POW జిల్లా కార్యదర్శి కల్పన, ప్రగతిశీల విద్యార్థి సంఘం భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ మాట్లాడుతూ, కలకత్తా నగరంలో డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ పై కొందరు దుండగులు చేసిన అత్యాచారాన్ని నిరసిస్తూ భద్రాచలంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.అత్యాచార నిందితులను గుర్తించి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరారు.మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు.వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అగాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏమిపట్టనట్లు వ్యవహరిస్తున్నాయని వారు విమర్శించారు. మహిళలపై దాడులు శిక్షించుటకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో దాసరి సాయి ,మునిగేల మహేశ్వరి ,కారం అంజలి ,సరోజినీ నాగమణి ,ఫెర్దోసి, షకీరా,కుమారి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్