E-PAPER

చైనాలో భారీ ప్రమాదం.. అత్యంత ఎత్తైన స్కైస్క్రాపర్‌ను ఢీకొట్టిన చిన్న విమానం!

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే నగరంలోని ఓ ఆకాశహర్మ్యాన్ని (స్కైస్క్రాపర్) చిన్న విమానం నేరుగా ఢీకొట్టింది. ఈ ఊహించని ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు.

ప్రమాద తీవ్రతకు భవనం పైభాగంలో తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విమానం ఢీకొట్టిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

ఈ దుర్ఘటనలో ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విమానం ఎలా ఢీకొట్టింది? సాంకేతిక లోపమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News