షాద్ నగర్ ఆగస్టు 12 వై సెవెన్ న్యూస్
ప్రతి ఒక్కరు కుంగ్ ఫు, కరాటే కచ్చితంగా నేర్చుకుని ఉండాలని సూచించారు న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్, మాస్టర్ బాల్ రాజ్, అహ్మద్ ఖాన్(బ్రూస్ లీ)లు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని కిరణ్ నాయక్ ఆధ్వర్యంలో చింతల కొండారెడ్డి ఫంక్షన్ హాల్ నందు 2వ జాతీయ స్థాయి ఓపెన్ టు ఆల్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించారు.ఈ ఛాంపియన్షిప్ లో షాద్ నగర్ పట్టణానికి చెందిన న్యూ పవర్ కుంగ్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పోటీలలో బ్లాక్ బెల్ట్ లో ఆర్తి, మొదటి ప్లేస్ గోల్డ్ మెడల్, బ్రౌన్ బెల్ట్ సిద్దు మొదటి ప్లేస్ గోల్డ్ మెడల్, నిఖిత బ్రౌన్,ఎస్య గ్రీన్ బెల్ట్ సాధించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ వారితో పాటుగా బిజెపి రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి కలిసి పాల్గొనడం జరిగింది.అనంతరం మాస్టర్ అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ) కు షీల్డ్ తో ఘనంగా సన్మానించారు.