E-PAPER

మోతే గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగాఅభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపాడు ఆగస్టు 12 వై సెవెన్ న్యూస్;
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లోని మోతె గ్రామ పంచాయతీని ,గ్రామంలో ఉన్న వీరభద్ర ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంత్రి జూపల్లి ని కోరారు.

పురాతన ఆలయం దర్శించడం కోసం బోటు రవాణా లేదని బోటు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో పుష్కర్ ఘాటు కూడా ఉందని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆలయం కూడా అభివృద్ధి జరుగుతుందని అందుకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు.పాయం వెంకటేశ్వర్లు కోరుకునే నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి మోతే గ్రామాన్ని ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పర్యాటక ప్రాంతంగా చేస్తానని అందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్