బైంసా,ఆగస్టు12(వై7 న్యూస్ ప్రతినిధి);
నిర్మల్ జిల్లా ,బైంసా లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అంతటా ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. బిజెపి మండల నాయకులు బోస్లే పండిత్ రావ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేసిన సందర్భంగా ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా నేటి తరానికి తెలియజేయాలన్నారు. దేశభక్తిని ప్రతి ఒక్కరు పెంపొందించుకునేలా పాటుపడాల్సిన బాధ్యత బిజెపి కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం బిజెపి నాయకులు బోస్లే పండిత్ రావ్ మాట్లాడుతూ బైంసా మండలంలోని అన్ని గ్రామాల్లో 2000 జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు భూమేష్, సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు, రమణారావు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అశోక్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సిరం సుష్మా రెడ్డి, బీసీ మోర్చా మండల అధ్యక్షులు దిగంబర్ మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.









