ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను నియమించాలని మెమోరండం ఇచ్చిన ఆత్రం సుగుణక్క
నిర్మల్ జిల్లా,ఆగస్టు,12(వై7 న్యూస్ ప్రతినిధి);
ఉట్నూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వార్దా నియోజకవర్గంలో ప్రచారం చేయటానికి ములుగు నుండి బయలు దేరిన మంత్రి సీతక్క ఉట్నూర్ మండల కేంద్రంలోని రాంజీ గోండ్ చౌక్ వద్ద ఆదివారం రాత్రి ఆగారు.ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క మర్యాదపూర్వకంగా కలిసి ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలనువివరించారు.ఉట్నూర్,
జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రలలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని విన్నవిస్తూ మెమొరండం ఇచ్చారు.జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకరే వైద్యుడు ఉండడం వల్ల ఐదు మండలాల ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదని,వైద్య పరికరాలు ఉన్న ఆపరేటర్స్ లేక ఇక్కడి ప్రజలు చిన్న వైద్యానికి కూడా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని వివరించారు.సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కఉట్నూర్,జైనూర్ ఆసుపత్రుల్లో వెంటనే వైద్యులను నియమిస్తామని తెలిపినట్లు సుగుణక్క పేర్కొన్నారు.









