భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని అనేక బీసీ ఎస్సీ హాస్టల్లో వార్డెన్ల నిర్లక్ష్యంతో విద్యార్థిని విద్యార్థులు అనేక వ్యాధులకు బాధలకు గురవుతున్నారని, ఇంకా అనేక సమస్యల నిలయంగా మారుతున్నాయని ప్రభుత్వం కూడా వీటిని నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని అందులో మచ్చుకు ఎస్సీ(S. C) బాలుర వసతి గృహం మణుగూరు వార్డెన్, మణుగూరులో నివాసము ఉండకుండా భద్రాచలం నుండి రాకపోకలు సాగిస్తున్నాడని
స్థానిక మణుగూరు ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఈరోజు సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం పలు సమస్యలను వెలికి తీసింది. ఈ హాస్టల్స్ తనకి విభాగంలో పాల్గొన్న,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి మాట్లాడుతూ వార్డెన్ స్థానికంగా ఉండకుండా భద్రాచలం నుండి వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే హాస్టల్ కి వస్తున్నారని తను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ హాస్టల్ విద్యార్థులకు మెనూ సక్రమంగా పాటించకుండా విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తూన్నారని పవన్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ఎస్సీ బాలుర వసతి గృహాధికారి వార్డెన్ శ్రీను పై గతంలో కూడా అనేక అభియోగాలు ఉన్నప్పటికీ ఉన్నత అధికారుల సహకారంతో అనేక సమస్యలు బయటికి రాకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఎక్కువ మొత్తంలో అటెండెన్స్ వేసుకుంటూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారని పవన్ సాయి అన్నారు. వర్షాకాలంలో హాస్టల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టించుకోకుండా నీటి నిలువలు ఉన్న గుంటల ను పూడ్చకుండా దోమలు తయారై విద్యార్థులను కుట్టడం వలన మలేరియా డెంగ్యూ లాంటి ప్రాణాంతకర వ్యాధులు వచ్చేలా ఉన్నాయని ఇంకా అనేక సమస్యలు నెలకొన్న వార్డెన్ స్పందించకుండా హాస్టల్ ని పట్టించుకోకుండా ఉన్నారని వెంటనే ఉన్నతాధికారులు డిడి ఏఎస్డబ్ల్యు స్పందించి వెంటనే అట్టి వార్డెన్ పై తగిన చర్యలు తీసుకుంటారని పవన్ డిమాండ్ చేశారు..









