సమస్యల నిలయంగా ఎస్సీ(S. C) బాలుర వసతి గృహం చుండ్రుగొండ
వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ
చంద్రుగొండ 02(వై 7 న్యూస్);చండ్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం పలు సమస్యలను వెలికి తీసింది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ మాట్లాడుతూ వార్డెన్ స్థానికంగా ఉండకుండా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే హాస్టల్ కి వస్తున్నారని ఒక్కొక్క వార్డెన్ కి ఒకటి లేదా మూడు హాస్టల్లో ఇన్చార్జి లిస్తూ తను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూన్నటువంటి S. C హాస్టల్స్ ఉన్నతాధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని వంశీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు మెనూ పాటించకుండా విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తూన్నారని వంశీ అన్నారు.ఎస్సీ బాలుర వసతి వార్డెన్ పై గతంలో కూడా అనేక అభియోగాలు ఉన్నప్పటికీ ఉన్నత అధికారుల సహకారంతో అనేక సమస్యలు బయటికి రాకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులను అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఎక్కువ మొత్తంలో అటెండెన్స్ వేసుకుంటూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారని వంశీ అన్నారు. వర్షాకాలంలో హాస్టల్లో అనేక సమస్యలు నెలకొన్న వార్డెన్ స్పందించకుండా హాస్టల్ ని పట్టించుకోకుండా ఉన్నారని వెంటనే ఉన్నతాధికారులు డిడి ఏఎస్డబ్ల్యు స్పందించి వెంటనే అట్టి వార్డెన్ పై తగిన చర్యలు తీసుకోవాలని వంశీ డిమాండ్ చేశారు కార్యక్రమంలో సాయి తేజ బాలాజీ శివ తదితరులు పాల్గొన్నారు