కూసుమంచి: తురకగూడెం గ్రామంలో మనుషులపై కోతుల దాడులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి..మొన్న కన్నెబోయిన రవి కుమార్ అనే వ్యక్తిపై కోతుల దాడి చేసి గాయపర్చాయి.. మంగళవారం గ్రామానికి చెందిన మేకల కృష్ణమూర్తి అనే వ్యక్తి పొలం పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా ఆయనపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. వెంటనే స్థానికులు స్పందించి ఆయనను కోతుల నుండి రక్షించారు…ఇలా కోతులు దాడులు వరుసగా జరుగుతుండడంతో గ్రామంలోని వారు ఇండ్ల నుండి బయటకి రావాలంటే భయపడిపోతున్నారు . చిన్నపిల్లలకి కూడా కోతుల నుండి హానీ జరిగే అవకాశం లేకపోలేదు.. వెంటనే గ్రామంలో కోతుల బెడదను తప్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు..
Post Views: 50