మణుగూరు,Y7 న్యూస్ తెలుగు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామ పంచాయతీ కార్యాలయం లో గ్రామ పంచాయతీ నూతన సెక్రటరీ గాదె. ప్రసాద రెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.
ఈ గ్రామ సభ లో పాల్గొన్న ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ గత పది రోజులు నుండి వర్షాలు పడడం వలన మురుగు నీరు నిల్వలు ఎక్కువ గా ఉండి దోమలు, ఈగలు పెరిగిపోయి విష జ్వరాలు, వాంతులు విరోచనాలు, అంటువ్యాదులు బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరు మీ ఇంటిని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే జ్వరాలు, అంటువ్యాధులు రావని గుడిపూడి. కోటేశ్వరరావు అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు, పంచాయతీ నూతన సెక్రటరీ ప్రసాద రెడ్డి, ఉపాధి హామీ పనుల ఫీల్డ్ ఆఫీసర్ మంగయ్య ఏ యన్ యం లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 96