E-PAPER

13 ఏళ్ల తర్వాత గ్రాండ్ తెఫ్ట్ ఆటో-6..! ఫీచర్లు ఇవే..!

వీడియో గేమ్ ప్రియులు గత 13 ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో-6’ (జీటీఏ 6) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. భారత్‌లో ఈ గేమ్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ప్లేస్టేషన్ 5 (పీఎస్5), ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్ కన్సోళ్లలో మాత్రమే ఈ గేమ్‌ను ఆడేందుకు వీలుంటుంది.

బిజినెస్ స్టాండర్డ్, ప్లేస్టేషన్ అధికారిక సమాచారం ప్రకారం, జీటీఏ-6 స్టాండర్డ్ ఎడిషన్ ధరను రూ.5,999గా నిర్ణయించారు. అదనపు ఫీచర్లు, వాహనాలు, ఆయుధాలు వంటి ప్రత్యేక హంగులతో కూడిన అల్టిమేట్ ఎడిషన్ ధర రూ.7,499గా ఉంది. ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కన్సోల్‌లో సుమారు 212 జీబీ స్టోరేజ్ అవసరమవుతుందని డెవలపర్ రాక్‌స్టార్ గేమ్స్ వెల్లడించింది. వినియోగదారుల సౌకర్యార్థం ఇప్పటికే ప్రీ-లోడింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఫ్లోరిడా స్ఫూర్తితో రూపొందించిన లియోనిడా అనే కల్పిత ప్రాంతం, వైస్ సిటీ నేపథ్యంలో ఈ గేమ్ సాగుతుంది. జేసన్, లూసియా అనే రెండు ప్రధాన పాత్రల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. అయితే, పీసీ వెర్షన్ విడుదల తేదీపై రాక్‌స్టార్ గేమ్స్ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2013లో విడుదలైన జీటీఏ-5 తర్వాత వస్తున్న ప్రధాన సిరీస్ గేమ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!