E-PAPER

అశ్వారావుపేట కబడ్డీ క్రీడా పోటీల ప్రారంభం

* రాష్ట్రస్థాయి అండర్ – 20 బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
* మినీ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని హామీ
* తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
* పేటలో ఎంపీ రఘురాంరెడ్డి తో కలిసి కబడ్డీ పోటీలను తిలకించి ప్రోత్సహించిన మంత్రి
* క్రీడాకారిణులందరికీ.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన శీనన్న

*అశ్వారావుపేట:* రాష్ట్రస్థాయి అండర్ – 20 బాలికల కబడ్డీ పోటీలతో అశ్వరావుపేటలో క్రీడా కోలాహలం నెలకొంది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం రాత్రి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ప్రధాన రహదారి నుంచి క్రీడాకారులు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్ లతో ర్యాలీగా మినీ స్టేడియం ప్రాంతానికి చేరుకోగా అంతా సందడి నెలకొంది.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో 50 శాతానికి పైగా పతకాలు మన తెలంగాణ క్రీడాకారులు గెలుచుకోవాలన్నదే సంకల్పమన్నారు. గెలుపోటములను పట్టించుకోకుండా.. క్రీడా స్ఫూర్తితో ఆడాలని అన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధతో.. పేటలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
*తొలిరోజు ఆరు జిల్లాల జట్లు..

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి ఖమ్మం- సూర్యాపేట, రంగారెడ్డి- భూపాలపల్లి, నల్లగొండ- ఆసిఫాబాద్ జిల్లాల జట్ల కబడ్డీ పోటీలను తిలకించి ప్రోత్సాహించారు. ఈ సందర్భంగా 33 జిల్లాల నుంచి వచ్చిన 34 జట్ల క్రీడాకారిణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
*ఈ కార్యక్రమంలో..:* ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!