భద్రాచలం: ఆంధ్ర కేసరి నగర్ గ్రామ శివారులో టిప్పర్ ఢీకొని బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది.

శ్రీనగర్ కాలనీ గ్రామానికి చెందిన పొడుతూరి నవీన్ (32) బైక్‌పై లక్ష్మీనగరం వైపు వెళ్తుండగా, చర్ల వైపు నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ ఒక కాలు తీవ్రంగా నుజ్జునుజ్జయింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం అంబులెన్స్‌లో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు.

ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










