పంటలను కాపాడేందుకు విద్యుత్ సరఫరా చేయాలని వినతి
అశ్వాపురం, అక్టోబర్ 8( Y7 న్యూస్ );
పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ అశ్వాపురం మండలానికి చెందిన రైతులు గురువారం అశ్వాపురం సబ్‌స్టేషన్ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
సాగునీటి కోసం అవసరమైన విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించి పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సబ్‌స్టేషన్ సిబ్బందిని కోరారు.
Post Views: 12









