E-PAPER

10,000mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్‌..! 32MP సెల్ఫీ కెమెరా..! ఫీచర్లు ఇవే..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ వివో భారత్‌లో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. వివో ఎస్‌2 ఎఫ్‌ఈ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ భారీ 10,000mAh బ్యాటరీతో ఆకట్టుకుంటోంది. 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300ఈ 5జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 8జీబీ ర్యామ్‌ అందించారు.

వివో ఎస్‌2 ఎఫ్‌ఈలో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. 1,260 x 2,800 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఉంటుంది. గరిష్ఠంగా 2,000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. స్క్రీన్‌ 449ppi పిక్సెల్‌ డెన్సిటీని కలిగి ఉంది.

ఫోన్‌లో 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300ఈ 5జీ ప్రాసెసర్‌ ఇచ్చారు. 8జీబీ వరకు LPDDR4x ర్యామ్‌ ఉంటుంది. 128జీబీ యూఎఫ్‌ఎస్‌ 2.2 స్టోరేజ్‌ అందించారు. వివో సొంత ఆరిజిన్‌ఓఎస్‌6పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్‌ 16 ఆధారంగా రూపొందించారు.

కెమెరాల విషయానికి వస్తే వెనక రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ ఐఎంఎక్స్‌852 ప్రధాన కెమెరాకు తోడు 2MP బొకే కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు 32MP కెమెరా ఉంది.

వివో ఎస్‌2 ఎప్‌ఈకి IP68, IP69 రేటింగ్‌ ఉంది. అంటే దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. ఫోన్‌ వేడెక్కకుండా ఉండేందుకు 3,800 చదరపు మిల్లీమీటర్ల వేపర్‌ ఛాంబర్‌ను అందించారు.

భారత్‌లో 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ ధర రూ.38,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ ధర రూ.42,999. స్టెల్లార్‌ గ్రీన్‌, టైటాన్‌ బ్లాక్‌, జెన్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. అక్టోబర్‌ 20 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, వివో ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.

లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా 10 శాతం ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ లేదా 10 శాతం ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ అందిస్తున్నారు. 100జీబీ గూగుల్‌ వన్‌ స్టోరేజ్‌ను ఉచితంగా ఇస్తున్నారు. వి-షీల్డ్‌ స్క్రీన్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!