E-PAPER

భద్రాచలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

12 నుంచి 21 వరకు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి ప్రత్యేక అలంకార సేవలు

భద్రాచలం, అక్టోబర్ 6, Y7 News Telugu:
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 12 నుంచి 21వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి వేద ఆశీర్వచన మండపం వద్ద ప్రతిరోజూ ప్రత్యేక అలంకార సేవలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. దామోదర్ రావు తెలిపారు.

శరన్నవరాత్రుల సందర్భంగా రోజువారీగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు. అక్టోబర్ 12న శ్రీ ఆదిలక్ష్మి, 13న శ్రీ సంతాన లక్ష్మీ, 14న శ్రీ గజలక్ష్మీ, 15న శ్రీ ధనలక్ష్మీ, 16న శ్రీ ధాన్యలక్ష్మీ, 17న శ్రీ విజయలక్ష్మీ, 18న శ్రీ ఐశ్వర్యలక్ష్మీ, 19న శ్రీ వీరలక్ష్మీ, 20న శ్రీ మహాలక్ష్మీ, 21న విజయదశమి సందర్భంగా శ్రీ నిజరూపలక్ష్మి అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.

విజయదశమి రోజున ఉదయం సంక్షేప రామాయణ హవన పూర్ణాహుతి, మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు దసరా మండపంలో విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజతో పాటు శ్రీ రామలీలా మహోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఉభయ సేవలకు అవకాశం

భక్తులు తమ గోత్రనామాలతో ప్రత్యేక అలంకార సేవలను జరిపించుకునేందుకు ఒక్కో అలంకారానికి రూ.1,000 ఉభయ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దంపతులు లేదా ఒక్కరు ఈ సేవలో పాల్గొనవచ్చు. అలాగే 10 సంవత్సరాల వరకు శాశ్వత ఉభయం రూ.10,000గా నిర్ణయించారు.

శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు తమ గోత్రనామాలతో శ్రీమద్రామాయణ పారాయణం, దశమి రోజున పట్టాభిషేకం నిర్వహించుకునేందుకు కూడా రూ.1,000 ఉభయ రుసుము, శాశ్వత ఉభయానికి రూ.10,000గా నిర్ణయించారు.

ఈ సేవల్లో పాల్గొనదలచిన భక్తులు ముందుగా నిర్ణీత రుసుమును దేవస్థానం కౌంటర్‌లో చెల్లించి రశీదు పొందాలని అధికారులు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!