ములుగు జిల్లా అక్టోబర్ 06 వై7 న్యూస్ తెలుగు
ములుగు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కే. డయాసాగర్ ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా మంగళవారం ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీస్ డయాసాగర్కు ఏఎస్సై ర్యాంక్ స్టార్‌ను అలంకరించారు

1990 కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన డయాసాగర్ తొలుత ఆదిలాబాద్ జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు ప్రారంభించారు. అనంతరం బెల్లంపల్లిలో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. తరువాత జీఆర్పీ (రైల్వే పోలీస్) విభాగంలో కూడా సేవలందించారు. ప్రస్తుతం బదిలీ పై ములుగు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఏఎస్సైగా పదోన్నతి పొందారు ఈ సందర్భంగా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీస్ పదోన్నతి పొందిన డయాసాగర్కు అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ములుగు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ నలువాల రవీందర్, ఎస్ఐ బుట్ట చంద్రశేఖర్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొని పదోన్నతి పొందిన ఏఎస్సై డయాసాగర్కు శుభాకాంక్షలు తెలిపారు









