E-PAPER

రాజుపేట బ్రిడ్జి వద్ద తాత్కాలిక డైవర్షన్ ఏర్పాటు చేయాలి

రోడ్డు ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి: తాటి వెంకటేశ్వర్లు

ములకలపల్లి: పాల్వంచ నుంచి దమ్మపేట, మందలపల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపేట వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు.

ములకలపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. రహదారి పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

రాజుపేట బ్రిడ్జి కూలిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున, రాకపోకలకు ఆటంకం కలగకుండా బ్రిడ్జి వద్ద తక్షణమే తాత్కాలిక సైడ్ డైవర్షన్ ఏర్పాటు చేయాలని తాటి వెంకటేశ్వర్లు అధికారులను కోరారు.

ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే కూలిపోయిన బ్రిడ్జికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులను కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!