E-PAPER

ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలు

భద్రాచలం: పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు సూచనలు చేశారు.

తనిఖీల సందర్భంగా వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలానాలను పోలీసులు పరిశీలించారు. పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులు అక్కడికక్కడే చలానాలను చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

రోడ్డు భద్రత దృష్ట్యా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని, అతివేగానికి దూరంగా ఉండాలని ఎస్‌ఐ తిరుపతిరావు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ తనిఖీల్లో ఏఎస్ఐ శంకర్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!